
Passwords Leaked: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. పలు దేశాల యూజర్లకు చెందిన సుమారు 16 బిలియన్ పాస్ వర్డ్స్ లీక్ చేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERT భారతీయులకు కీలక సూచనలు చేసింది. యాపిల్, గూగుల్, ఫేస్ బుక్ సహా పలువురు యూజర్లకు తీసుకోవాల్సిన చర్యల గురించి వెల్లడించింది.
CERT ఏం చెప్పిందంటే?
కోట్లాది మంది పాస్ వర్డ్స్ లీక్ అయిన నేపథ్యంలో ఆ అకౌంట్స్ సైబర్ నేరస్థుల చేతికి వెళ్లకుండా పాస్ వర్డ్స్ మార్చుకోవాలని CERT సూచించింది. బ్యాంకింగ్, సోషల్ మీడియా, గవర్నమెంట్ పోర్టల్స్ కు చెందిన అకౌంట్స్ ఉన్న వాళ్లు వెంటనే పాస్ వర్డ్స్ మార్చుకోవాలని వెల్లడించింది. పాత పాస్ వర్డ్స్ స్థానంలో అక్షరాలతో పాటు సంఖ్యలు, సింబల్స్ తో కూడిన స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ ను పెట్టుకోవాలని సూచించింది. అంతేకాదు, ఒకే పాస్ వర్డ్ ను అన్ని యాప్ లు, వెబ్ సైట్స్ లాగిన్ కు వాడకూడదని వెల్లడించింది. అంతేకాదు, లాగిన్ విషయంలో ఎస్ ఎమ్ ఎస్ ఆధారిత వ్యవస్థలతో పాస్ వర్డ్స్ కు అదనపు సెక్యూరిటీని యాడ్ చేసుకోవచ్చని సూచించింది. అంతేకాదు, ఫిషింగ్ దాడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నది. పాస్ వర్డ్ రీసెట్, అర్జెంట్ నోటిఫికేషన్స్ పేరిట వచ్చే లింకులను అస్సలు క్లిక్ చేయకూడదని వెల్లడించింది.
పాస్ వర్డ్ లీక్ అంటే ఏంటి?
సోషల్ మీడియా, బ్యాంకింగ్ సహా ఇతర లాగిన్ పాస్ వర్డ్స్ ను సైబర్ నేరస్తులు ఫిషింగ్ లింక్స్ ద్వారా తస్కరించినట్లు తెలుస్తోంది. సరైన సెక్యూరిటీ వ్యవస్థ లేని డేటా బేస్ నుంచి ఈ పాస్ వర్డ్స్ లీక్ అయినట్లు నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భారతీయులు అలర్ట్ గా ఉండాలని వెంటనే పాస్ వర్డ్స్ మార్చుకోవాలని టెక్ నిపుణలు సూచించారు.
Read Also: అమెరికాలో పుట్టిన మరో పార్టీ, పేరు ప్రకటించిన ఎలన్ మస్క్!