తెలంగాణ

14 ఏళ్ల బాలుడి హత్య కేసును 24 గంటల్లోనే చేదించిన పోలీసులు!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :
ఈ నెల 17న జరిగిన 14 ఏళ్ల బాలుడి హత్య కేసును నిర్మల్ పోలీసులు ఛేదించి, నిందితుడిని 24 గంటల్లోనే అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. చిట్యాల గ్రామ శివార్లలోని చింతల సరస్సు సమీపంలో బండరాయితో కొట్టి చంపబడిన రిషి అనే 14 ఏళ్ల బాలుడిని గుర్తించిన స్థానికులు బాలుడి తల్లి రాజమణికి సమాచారం అందించారు. ఆమె వెంటనే నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన SI లింబాద్రి వెంటనే నిర్మల్ ASP రాజేష్ మీనా IPSకి హత్య గురించి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ASP, ఈ వివరాలను జిల్లా SP జానకి షర్మిలకు తెలియజేశారు.

ప్రపంచ పెద్దన్న ప్రమాణస్వీకారం!.. అందరిలోనూ టెన్షన్.. టెన్షన్?

శనివారం ఉదయం కేసు వివరాలు తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ సహా నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కేసును చేధించే వరకు పర్యవేక్షించి, నిర్మల్ ఎఎస్పీ రాజేష్ మీనాకు సూచనలు ఇచ్చారు.డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. వెంటనే స్పందించిన ఎఎస్పీ ఒక అనుమానితుడిని పట్టుకుని విచారించగా, అతను నేరం అంగీకరించాడు.

మొన్న మహారాష్ట్ర!… నేడు ఢిల్లీ!… కేంద్రంలో రేవంత్ మార్క్?

అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్ అనే వ్యక్తికి స్వలింగ సంపర్కం అలవాటు ఉంది. తన కామాన్ని తీర్చుకోవడానికి, 17.01.2025న అర్ధరాత్రి చిట్యాల గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందనే భయంతో, ఆ బాలుడిని బండరాయితో దారుణంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు.

అమెరికాలోని భారతీయులకు గండం! నేడే ట్రంప్ ప్రమాణం

ఏఎస్పీ నేతృత్వంలోని బృందం, జిల్లా డాగ్ స్క్వాడ్, క్రైమ్ బృందం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, హత్య జరిగిన గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.ఈ కేసులో సూచనలు మరియు సలహాలు ఇచ్చిన అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్, ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐలు లింబాద్రి, సందీప్, సాయి కిరణ్ మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button