క్రైమ్తెలంగాణ

సినిమాలను వెంటాడుతున్న పైరసీ భూతం.. నిందితుడి సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- మన దేశవ్యాప్తంగా ఈ మధ్య ఎన్నో సినిమాలు పైరసీకి గురయ్యాయి. దీని ద్వారా సినిమా కలెక్షన్లు భారీగా పడిపోతున్నాయి. అయితే ఫ్రీగా వస్తున్నాయని పైరసీ సినిమాలు చూడడం చాలా ప్రమాదకరమని తాజాగా హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ లో రిలీజ్ అవ్వకముందే పలు వెబ్సైట్ లలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అలాంటి వెబ్సైట్లో సినిమాలు చూస్తున్నప్పుడు మధ్యలో చాలానే ప్రకటనలు చూడాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలోనే మన వ్యక్తిగత వివరాలు వారికి తెలిసిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని.. వీటి ద్వారానే చాలామంది సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని సీపీ ఆనంద్ హెచ్చరించారు. ప్రతిరోజు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు పట్టించుకోకుండా ఏముందిలే.. అని వదిలేస్తున్నారు. దీని ద్వారా మొబైల్ హ్యాక్ అవ్వడమే కాకుండా మన ఎకౌంట్లో ఉన్న డబ్బులు కూడా కట్ అవుతాయని తెలిపారు. ప్రపంచంలో ఏదీ కూడా ఫ్రీగా రాదని… అలా వచ్చిందంటే కచ్చితంగా అది మోసమే అని గుర్తుంచుకోవాలని ప్రజలకు సూచించారు.

Read also : ఏపీలో వర్షాలు… నిమ్మల రామానాయుడుకు కీలక సూచనలు చేసిన చంద్రబాబు!

మరోవైపు పైరసీ కేసులో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని సీపీ ఆనంద్ వెల్లడించారు. అతని పేరు సిరిల్ గా గుర్తించారు. ఈ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అన్ని భాషల చిత్రాలను ఏజెంట్లను నియమించుకొని పైరసీ చేస్తున్నట్లుగా గుర్తించామని.. ఇతను కేవలం సినిమాలకు సంబంధించి మాత్రమే కాకుండా ప్రభుత్వ విభాగాలు అలాగే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లు కూడా హ్యాక్ చేయగల సామర్థ్యం గల వ్యక్తి అని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రమోషన్లకు బెట్టింగ్ యాప్ కంపెనీలు ఇతనుకు ఎంత చెల్లిస్తున్నారనేది తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఈ పైరసీ కేసులో నిందితుడిగా గుర్తించిన సిరిల్ అనే వ్యక్తి నెలకు ఏకంగా 9 లక్షల రూపాయలు జీతం లా తీసుకుంటున్నాడు అని సంచలన విషయాలను బయటపెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పైరసీ కేసు సంచలనం కాగా… అతని శాలరీ చూసి మరికొంత మంది బిత్తరపోతున్నారు. ఇంకొంతమంది దేనికైనా టాలెంట్ కావాలని అంటున్నారు.

Read also : ఎన్నికలకు దూరంగా మంగపేట మండలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button