హైదరాబాదులో బిర్యానీలో కప్ప రావడం చూసి అందరు కూడా ఒకసారిగా షాక్ కి గురయ్యారు. కప్పు వచ్చిన బిర్యాని ఒక విద్యార్థి ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా ఇది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఇక అసలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హైదరాబాదులోని గచ్చిబౌలి త్రిబుల్ ఐటీ క్యాంపస్లో మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కదంబ మెస్ లో భోజనం చేస్తుండగా ఓ విద్యార్థినికి వడ్డించిన చికెన్ బిర్యానిలో కప్ప కనిపించడంతో విద్యార్థులందరూ కూడా షాక్ గురయ్యారు. బిర్యానీ తిందామని కూర్చున్న విద్యార్థులకు చికెన్ ముక్కలతోపాటు కప్పు ముక్క కూడా కనపడేసరికి విద్యార్థులందరూ కూడా వాంతు వచ్చినట్లు అయింది. ఇక కప్పు ఉన్న బిర్యానీ ప్లేట్ ని తీసుకెళ్లి ఇన్చార్జి కి ఫిర్యాదు చేశారు.
ఇలాంటి ఆహారం సప్లై చేస్తున్న మెస్ నిర్వాహకులపై ఆందోళనకు దిగారు విద్యార్థులు. మెస్ లో శుభ్రత లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని విద్యార్థులు మండిపడ్డారు. ఇలాంటి వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు.