
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమిండియా మాజీ, తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా తండ్రయ్యారు. అంబటి రాయుడు భార్య విద్య మగ బిడ్డకు జన్మనిచ్చారు. స్వయంగా అంబటి రాయుడే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా శిశువు మరియు అతని భార్యతో కలిపి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాయుడు ఫ్యాన్స్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు అందరూ కూడా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా 2009వ సంవత్సరంలో అంబటి రాయుడు విద్యను వివాహం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత అంబటి రాయుడు పలు లీగ్ మ్యాచ్లు ఆడుతూనే మరోవైపు తెలుగు కామెంటర్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. తెలుగు క్రికెటర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి అంబటి రాయుడు ఎన్నో లీగ్ మ్యాచ్లలో తెలుగు వారి సత్తా ఏంటో చూపించారు. ఐపీఎల్ లోను అంబటి రాయుడు అద్భుతంగా రాణించినప్పటికీ అతనికి అంతర్జాతీయంగా మాత్రం కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. కానీ IPL ద్వారా రాయుడుకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఏది ఏమైనా కూడా 20 స్ యువతకు అంబటి రాయుడు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండేవారు.
Read also : తమిళ తోపు డైరెక్టర్స్ తో ఐకాన్ హీరో సినిమాలు ఫిక్స్?
Read also : గంజాయి మత్తులో వీరంగం.. ఇద్దరు మహిళలపై దారుణం (VIDEO)





