తెలంగాణ

రేవంత్‌ సర్కార్‌ బురద రాజకీయం: హరీశ్‌రావు

  • కాళేశ్వరంపై బురదజల్లడమే కాంగ్రెస్‌ లక్ష్యం

  • వరదలు, యూరియాపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు

  • విపత్తు సమయంలో రెండురోజులే అసెంబ్లీ సమావేశాలా?

  • బీఏసీ సమావేశం నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణ బీఏసీ సమావేశం నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌ చేసింది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు సుమారు 15రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ కోరింది. అయితే దీనికి ఒప్పుకోని సర్కార్‌… కేవలం రెండురోజులే సభ జరపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్‌ వాకౌట్‌ చేసింది.

అనంతరం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డి సర్కార్‌ బురద రాజకీయాలకే ప్రాధాన్యమిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో బీఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకే సమావేశాలు పెట్టినట్లుగా ఉందని హరీశ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారని, అదే సమయంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి విషయాలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేనట్లు అర్థమవుతోందని హరీశ్‌రావు ఆక్షేపించారు. యూరియా విషయంలో కాంగ్రెస్‌పై బీజేపీ, కేంద్రంపై కాంగ్రెస్‌ ఒకరినొకరి విమర్శించుకుంటూ కాలం వెళ్లదీయడం సరికాదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: 

  1. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు
  2. ఇక అసెంబ్లీకి రాను: కోమటిరెడ్డి
  3. యూరియా అడిగితేనే కొట్టేస్తారా?.. పోలీస్ పై ఆగ్రహించిన రైతన్నలు!
Back to top button