Tuesday, February 24, 2026
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్

సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు, వరదలతో వాటిల్లిన నష్టాన్ని అమిత్ షాకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అమిత్ షా కు తెలిపారు సీఎం. అవసరమైన తక్షణ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు అమిత్ షా.

కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా హామీ ఇచ్చారు. వరద పరిస్థితులపై రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్ల తో నేరుగా మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments