జాతీయం

సన్యాసం తీసుకున్న అందమైన హీరోయిన్.. కుంభమేళాలో అద్భుతం

ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అద్భుతం జరిగింది. అందమైన బాలీవుడ్ మాజీ హీరోయిన్ సన్యాసం తీసుకుంది. హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగి.. తన అందంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన మమతా కులకర్ణి అందరిని ఆశ్చర్యపరుస్తూ కుంభమేళాలో సన్యాసం తీసుకుంది. మమతా కులకర్ణి తెలుగులో ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ సినిమాల్లోనూ నటించింది.

యూపీలోని ప్రయోగ్ రాజ్‎లో అత్యంత ఘనంగా సాగుతున్న మహా కుంభమేళా సాక్షిగా మమతా కులకర్ణి సన్యాసం స్వీకరించి సాధ్విగా మారిపోయారు. 2025, జనవరి 24వ తేదీ ఉదయం మహాకుంభ్‌లోని కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి సమక్షంలో అందాల భామ సన్యాస దీక్ష తీసుకున్నారు.కాషాయ దుస్తులు ధరించి.. మెడలో రుద్రాక్ష మాల, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో నిజమైన సాధ్విగా మారిపోయారు.

సన్యాసం పుచ్చుకున్న తర్వాత మమతా కులకర్ణి పేరు కూడా మార్చుకున్నారు. ఆమె కొత్త పేరు మై మమతానంద్ గిరి సాధ్వి. మమతా కులకర్ణి సన్యాసం తీసుకున్న దృశ్యాలు, ఆ తర్వాత ఆమె పూర్తిగా సాధ్విగా మారిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. తన అందం, అభినయంతో అప్పట్లో కుర్రకారును ఊర్రూతలూగించిన మమతా కులకర్ణి ఒక్కసారిగా సన్యాసిగా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ షాక్‎కి గురి అవుతున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button