తెలంగాణ

రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-బుధవారం సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత్ కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరు కి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు ఉండడం విశేషం. తమ నైపుణ్యంతో తయారు చేసినటువంటి చేనేత ఉత్పత్తులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు అలాగే రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు స్వయంగా వివరించారు.

ఈ చేనేత కళాకారుల ఉత్పత్తులను చూసి ప్రముఖులంతా ఎంతగానో అభినందించారు. గంజి యాదగిరి చిలుకూరు శ్రీనివాసులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజులపాటు ప్రదర్శన జరగనుంది.

ఇవి కూడా చదవండి

1.విలువైన ఆభరణాలు.. హుండీలోని డబ్బులను దోచేసిన దొంగలను పట్టుకున్న పోలీసులు

2.నాగబాబుకు ఎమ్మెల్సీ – రూటు మార్చిన పవన్‌ కళ్యాణ్‌..!

3.ఈసారికి జగన్‌ను క్షమిస్తున్నా- శృతిమించితే ఊరుకోమంటూ స్పీకర్‌ అయ్యన్న రూలింగ్‌

Back to top button