
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఈ వ్యాధి గురించే మాట్లాడుతూ ఉన్నారు. వైద్యులు సైతం ఈ వ్యాధి గురించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా విజయనగరం మరియు పల్నాడు ఈ రెండు జిల్లాలలో ఈ వ్యాధి లక్షణాలతో ఏకంగా ముగ్గురు మరణించడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు నమోదయినట్లుగా అధికారులు చెబుతున్నారు. కానీ అనధికారికంగా తెలియని కేసులు ఎన్నో ఉన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది.
Read also : రజనీకాంత్ ను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత మృతి..!
అసలే చలికాలం… ఈ కాలంలో ఏవైనా వ్యాధులు సరే చిటికెలో వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడకుండా ఉండాలి అంటే కచ్చితంగా ఫిబ్రవరి నెల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలోనే ఇన్ఫెక్షన్లనేవి ఎక్కువగా సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ పురుగు ఏదైతే ఉంటుందో అది కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది అని తద్వారా తీవ్రమైన జ్వరం, తలనొప్పి మరియు కండరాల నొప్పులు వంటివి వస్తుంటాయని వైద్యులు చెప్పారు. ఎక్కువగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లోనే ఈ కీటకాలు ఉంటాయని… ఇవి కుడితే వెంటనే వ్యాధి సోకుతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి పొలం పనులకు వెళ్ళేటటువంటి వారు కచ్చితంగా షూలు లాంటివి ధరించాలి అని.. మంచాలు మరియు పరుపులు వంటివి వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవాలని అధికారులు తెలిపారు. కాబట్టి ఏదైనా కీటకం కుట్టినప్పుడు నల్ల మచ్చ ఏర్పడిన లేదా తీవ్రమైన జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు లాంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Read also : చేజింగ్ లో రికార్డ్.. అదరగొట్టేసారు అంతే!





