
క్రైమ్ మిర్రర్, మాడుగుల పల్లి : ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఇన్చార్జి ఎంపీడీవో సంగీత అన్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఎంపిఓ టి.సంగీత ఇన్చార్జి ఎంపీడీవో గా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న తిరుమల స్వామి వికారాబాద్ జిల్లాకు బదిలీ అవ్వడంతో మడుగులపల్లి మండల నూతన ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించే అంత వరకు ఎంపీఓ గా విధులు నిర్వహిస్తున్న టీ.సంగీత కు ఇన్చార్జ్ ఎంపీడీవో గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మండలంలోని ప్రజలకు, ప్రతి గ్రామంలోని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని అన్నారు. ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించినందుకుగాను అభినందనలు తెలియజేశారు.