తెలంగాణ

మాట వినలేదనే కోపంతో రైతులను రేవంత్ సోదరులు చంపేస్తున్నరు!

లగచర్ల గిరిజన రైతు బిడ్డ హీర్యా నాయక్ కు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ తీవ్ర అగ్రహం, అవేదన వ్యక్తం చేశారు. గుండె నొప్పి వచ్చిన రైతన్నకు బేడీలు వేయడం అమానావీయం, రేవంత్ కూృర మనసత్వానికి నిదర్శనమన్నారు. జైలులో ఉన్న రైతు బిడ్డ హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే… వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఆసుపత్రికి తరలించకుండా.. తగిన చికిత్స అందించకుండా అమానవీయంగా వ్యవహరించిందని కేటీఆర్ మండిపడ్డారు.

ఈరోజు ఉదయం మళ్లీ గుండెపోటు వచ్చింది… సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారు… ఇప్పుడు మేము ఒత్తిడి తేవడంతో హైదరాబాద్ కి తరలిస్తామని చెప్తున్నారని కేటీఆర్ తెలిపారు. వారితోపాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందన్నారు. మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. గుండెపోటు వచ్చిన రైతుబిడ్డకు బేడీలు వేసి అన్యాయంగా, అమానవీయంగా ఆసుపత్రికి తీసుకువచ్చింది ప్రభుత్వం.. స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సిన మనిషిని బేడీలు వేసి తీసుకువచ్చారని తెలిపారు.ఇంతటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రవర్తన క్షమార్హం కాదని కేటీఆర్ ధ్వజమెత్తారు.

రాజ్యాంగం లోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం ఖైదీలను హక్కులను హరించడమే అన్నారు కేటీఆర్. నూతన క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రావెల్స్ ఖైదీల హక్కులను హరించడమేనన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. రాష్ట్ర గవర్నర్ ఈ అంశం లోని తగిన విచారణకు ఆదేశించాలని విన్నవించారు కేటీఆర్.

ముఖ్యమంత్రి జైపూర్లో విందులు వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు వేస్తున్నారని.. కానీ తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే వెంటనే తమ ప్రభుత్వానికి కేసులు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వానికి చేతకాకుంటే వారందరికీ అవసరమైన వైద్య సహకారాన్ని, సహాయన్ని మా పార్టీ తరఫున అందిస్తామని కేటీఆర్ తెలిపారు. మా సామ్రాజ్యంలోకి మేము చెప్పిందే నడవాలని అహంకారంతోనే, రేవంత్ రెడ్డి ఆయన సోదరులు గిరిజన రైతన్నల ప్రాణాలు తీస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కేవలం తన మాట వినలేదు అన్న ఏకైక కారణంతోనే వారి పైన దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని..రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని కేటీఆర్ సూచించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button