హైదరాబాద్ పాతబస్తీ బేగంబజార్ లో దారుణం జరిగింది. పోలీస్టేషన్ పరిధిలోనితొప్ ఖానా లో భార్య కుమారుణ్ని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు సిరాజ్. తల్లి తమ్ముణ్ణి చంపుతున్న తండ్రిని చూసి కేకలు పెట్టి పారిపోయాడు సిరాజ్ పెద్ద కొడుకు. అరుపులతో అలర్ట్ అయిన స్థానికులు.. పెద్ద కొడుకును చంపకుండా అడ్డుకున్నారు.
భార్య హేలియ గొంతు కోసిన కిరాతకుడు.. కుమారుడు హైజాన్ గొంతు నులిమి చంపి చంపేశాడు. హంతకుడిని మహమ్మద్ సిరాజ్ గా గుర్తించారు. ఇద్దరిని చంపిన తర్వాత తాను సూసైడ్ చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బేగంబజార్ పోలీసులు,క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉత్తర ప్రదేశ్ నుంచి బ్రతుకు దేరువు కోసం హైదరాబాద్ వచ్చింది హంతకుడి కుటుంబం.