తెలంగాణలో సంచలనంగా మారిన మీర్ పేట మహిళ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. నిందితుడు గురుమూర్తికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గురుమూర్తి ఫోన్లో మరో మహిళతో చనువుగా ఉన్న ఫోటోలను గుర్తించారు పోలీసులు. భార్యను వదిలించడం కోసమే హత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు.
ఈ నెల 13 న భార్య పిల్లలతో మాధవి సోదరి ఇంటికి వెళ్లాడు గురుమూర్తి. ఈ నెల 14 తిరిగి ఇంటికీ వచ్చారు. ఇద్దరు పిల్లలను బంధువు ఇంటి వద్దనే వదిలి పెట్టారు గుర్తుమూర్తి దంపతులు. ఈ నెల 15న గురుమూర్తి, మాధవి మధ్య వివాదం జరిగింది. ఇద్దరి మధ్య గొడవ తో భార్యను కత్తితో పొడిచి చంపాడు గురుమూర్తి. అనంతరం భార్య మృత దేహాన్ని మటన్ కొట్టే కత్తితో ముక్కలు చేశాడు. శరీర భాగాలను బకెట్ వాటర్లో పెట్టి హీటర్ ద్వారా ఉడికించాడు నిందితుడు గురుమూర్తి.
ఈ నెల 18న మీర్ పేట్ పీఎస్ లో మిస్సింగ్ కేసు పెట్టారు మాధవి తల్లి సుబ్బమ్మ, గురుమూర్తి. గురుమూర్తి ఇంటి పరిసరాల్లో సిసి కెమెరాలు పరిశీలించారు పోలీసులు. అయితే మాధవి ఇంటి నుండి బయటికి వెళ్లినట్లు కనిపించని ఆనవాళ్లు. దీంతో అనుమానంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది.