
గ్రేటర్ హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరాలతో పోటి పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిదని అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినొద్దీన్, సీనియర్ నాయకుడు, కంటెస్టెడ్ ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి చెప్పారు. డివిజన్ పరిధిలో గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ సహకారంతో అల్లాపూర్ డివిజన్ కు భారీగా నిధులు తీసుకొచ్చామని వెల్లడించారు.
శ్రీ వివేకానంద నగర్ లోని రోడ్డు నెంబర్ 8,9,10,11లలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మొయినొద్దీన్, మస్తాన్ రెడ్డిలు.. తాము కోరిన వెంటనే జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించిన బండి రమేష్ కు కాలనీ వాసుల తరపున కృతజ్ణతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు రవి ముదిరాజ్, ధర్మారావు, చప్పిడి శ్రీనివాస్, పెండెం పవన్, ఆంజనేయులు, బొంత రవి, సతీష్ రెడ్డి, సుబ్బయ్య చౌదరి, అన్వర్, ఉపేందర్ పాల్గొన్నారు.