
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ చిన్నారుల మృతి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కన్నబిడ్డలకు పెరుగన్నంలో విషం కలిపి తల్లి చంపేసిందని మొదట భావించారు. పెరుగన్నం తినక పోవడంతో భర్త బతికి పోయాడని చెప్పారు. కాని పోలీసుల విచారణ తర్వాత సీన్ మారిపోయింది. కసాయి తల్లి కన్నిబిడ్డలపై క్రూరంగా వ్యవహరించిందని తేలింది. ముగ్గురు పిల్లలను టవల్‌తో ఉరివేసి తల్లి హత్య చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
హంతకురాలు రజితకు 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఆ సమయంలో రజితకు 20 సంవత్సరాలు ఉండగా.. ఆమె భర్తకు 40 ఏళ్లు, ఇద్దరి మధ్య 20 ఏళ్ల గ్యాప్. అయితే మొదట ఇద్దరు బాగానే ఉన్నారు. వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే పదవ తరగతి క్లాస్ మేట్ శివకుమార్ గెట్ టు గెదర్ పార్టీలో కలిశారు. పాత జ్ఞాపకాలతో ఇద్దరు మళ్లీ కలిసిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రజితను పెళ్లి చేసుకుంటానని చెప్పిన శివకుమార్.. తాను పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయాడు. ఇక ఇద్దరు పెళ్లి చేసుకొందామని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న పిల్లలను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది.
పిల్లలు, భర్తను చంపేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారు. అందులోభాగంగానే ముగ్గురు పిల్లలను రజిత అత్యంత కిరాతకంగా హత్య చేసింది. తన చెల్లి వివాహం కాగానే రజితను పెళ్లి చేసుకుంటానని శివ కుమార్ హామీ ఇచ్చాడు. దీంతో ముగ్గురు పిల్లల హత్యకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ప్రియుడితో సుఖం కోసం ముగ్గురి పిల్లలను చంపడానికి మనసు ఎలా వచ్చిందని స్థానికులు బోరుమంటున్నారు. పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కన్నబిడ్డలను ఉరి వేసిన చంపిన రజితను ఊరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు .