
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మన భారతదేశంలో ఎన్నడు లేని విధంగా ఒక బిక్షగాడిని అరెస్ట్ చేశారు. ఒక మామూలు బిచ్చగాడిని అరెస్టు చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ లో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భిక్షాటన చేస్తున్న ఒక మామూలు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. భోపాల్ లో నివసిస్తున్నటువంటి వేరే ఒక మనిషి ఆ భిక్షాటన చేస్తున్న వ్యక్తి పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బిచ్చమెత్తుకుంటున్న వ్యక్తిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.
లోకేష్ యువగళం పాదయాత్రకు నేటితో రెండేళ్లు!..
అయితే తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం బిక్షాటన నిరోధక చట్టాన్ని తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇండోర్ నగరాన్ని బిచ్చగాడు లేని నగరంగా చూడాలనే ఆలోచనతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఉన్నటువంటి బిక్షగాళ్లను పట్టిస్తే ₹1000 బహుమతి ఇస్తామని కూడా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రతి ఒక్కరు బిచ్చగాళ్లను పట్టించే పనిలో ఉన్నారు. ఇక అప్పటినుంచి ఈ ప్లేస్ లో బిచ్చగాడు ఉన్నాడు అంటూ పోలీసులకు అలాగే అధికారులకు కొన్ని వందలు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే అంతటితో ఆగిపోకుండా అధికారులు కూడా ఫోన్ చేసిన అందరికీ ₹1000 బహుమతిగా అందించారు. అయితే ఒక మామూలు బిక్షగాడిని అరెస్టు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.