
కామారెడ్డి, క్రైమ్ మిర్రర్ :- కామారెడ్డి జిల్లా వరద ప్రధాయిని అయిన నిజంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి నీటి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు అధికారులు దిగువన గల మంజీరా లోకి నీటిని వదులుతున్నారు. ఆదివారం రాత్రి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,ప్రాజెక్టు అధికారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రాత్రి 5 వరద గేట్లను ఎత్తారు. సోమవారం ఉదయం వరద పోటెత్తడంతో 7 వరద గేట్ల ద్వారా 53,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. సోమవారం మధ్యాహ్నం సింగూరు,పోచారం,ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు 13 గేట్లను ఎత్తి అంతే స్థాయిలో దిగువన గల మంజీరా నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,చేపలు పట్టేవారు,పశువుల కాపరులు,రైతులు ఎవరు కూడా నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
Read also : ఉప్పల్‌లో ఉద్రిక్తత: రామంతాపూర్ విద్యుత్ ప్రమాదం ఘటనపై స్థానికుల ఆందోళన
Read also : “కూలీ” VS “వార్ -2″… గెలిచిందెవరు?