జాతీయం

కన్నడ వచ్చా? అన్న సిద్ధరామయ్య, ఆసక్తిర సమాధానం చెప్పిన రాష్ట్రపతి!

Droupadi Murmu On Kannada: కన్నాటకలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆసక్తికర సమాధానం చెప్పారు. మైసూర్‌ లోని అలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే కార్యక్రమంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య, ప్రెసిడెంట్ ముర్ము మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. రాష్ట్రపతిని ఆయన “మీకు కన్నడ వచ్చా?” అని అడిగారు.  దానికి  ప్రెసిడెంట్ ఆసక్తికర సమాధానం చెప్పారు.

కన్నడ రాదు, కానీ..

కన్నడ ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు దుకు ముర్ము నవ్వుతూ సమాధానం చెప్పారు. “గౌరవనీయులైన ముఖ్యమంత్రికి నా మాతృభాష కన్నడ కాదని తెలియజేస్తున్నా. అయితే.. నాకు దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు, పద్ధతులను ఇష్టపడుతాను. ప్రతి భాష పట్ల నాకెంతో గౌరవం ఉన్నాయి. ప్రతి ఒక్కరు తమ మాతృభాషను బతికించుకునేందుకు పాటుపడుతుంటారు. తమ సంస్కృతి, సంప్రదాయాలను తమ పిల్లలకు వారసత్వంగా నేర్పిస్తారు. అలా చేస్తున్నందుకు అందరికీ నా అభినందనలు. ఇక కన్నడ విషయానికొస్తే.. కచ్చితంగా నేర్చుకునేందుకు ప్రయత్నం చేస్తాను” అని చెప్పుకొచ్చారు. గత కొంత కాలంగా కర్ణాటకలో కన్నడ వివాదం కొనసాగుతుంది. కర్నాటకలో ఉండేవాళ్లంతా కన్నడ నేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య.. రాష్ట్రపతిని మీకు కన్నడ వచ్చా? అని అడగడం ఆసక్తి కలిగిస్తోంది.

Back to top button