
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరమైనటువంటి విశాఖపట్నంలో నేడు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 4:30 గంటల మధ్య స్వల్ప భూకంపం సంభవించింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా నిద్రపోతుండగా… ఎవరికి కూడా ఎటువంటి శబ్దాలు వినిపించలేదు. కానీ మేలుకొని ఉన్నటువంటి కొంతమందికి కొన్నిచోట్ల శబ్దాలు వచ్చినట్లుగా కూడా చెబుతున్నారు. విశాఖపట్నంలోని గాజువాక, మధురవాడ, రిషికొండ, కైలాసపురం, భీమిలి, మహారాణిపేట, విశాలాక్షి నగర్, అక్కయ్యపాలెం వంటి తదివర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కనిపించింది అని స్థానికులు చెప్పారు. దీంతో విశాఖ నగర ప్రాంత ప్రజలు తెల్లవారుజామున ఈ విషయం తెలుసుకున్న వెంటనే అవునా అని ఆశ్చర్యపోతున్నారు. కొంతమందికి ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా .. దీనివల్ల శబ్దాలు కూడా వచ్చినట్లుగా కొంతమంది చెబుతుంటే మరి కొంతమంది నిద్రపోవడం వల్ల ఏమీ తెలియదు అని చెప్తున్నారు.
Read also : ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీల నిరవధిక బంద్
Read also : వైసీపీ ఒక ఫేక్ పార్టీ .. ఈ మాట ఊరికే అనట్లేదు : మంత్రి లోకేష్
				
					
						




