Tuesday, February 24, 2026
Homeతెలంగాణతీగల కృష్ణారెడ్డి బూతు పురాణం.. ఆడియో లీక్

తీగల కృష్ణారెడ్డి బూతు పురాణం.. ఆడియో లీక్

మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి మరియు ఓ వ్యక్తి మధ్య బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఓ వ్యక్తితో తీగల కృష్ణారెడ్డి వాగ్వాదం చేస్తున్నారు. తన కోడలికి ఎందుకు ఫోన్ చేశావని అవతలి వ్యక్తిని ప్రశ్నించారు. తనతో అర్గ్యుమెంట్ చేసే దమ్ముందా అంటూ రెచ్చిపోయాడు. నీ ఇంటికొచ్చి సంగతి చూస్తానని అవతలి వ్యక్తిని బెదిరించాడు తీగల కృష్ణారెడ్డి.

ఫోన్ సంబాషణల్లో అవతలి వ్యక్తి కూడా గట్టిగా మాట్లాడుతుండటంతో.. మరింతగా రెచ్చిపోయారు తీగల కృష్ణారెడ్డి. అతనిపై బూతులతో విరుచుకుపడ్డారు. రాయలేని బాషతో తిట్టిపోశాడు. తీగలకు సంబంధించి లీకైన ఈ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తీగల కృష్ణారెడ్డి మరియు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి త్వరలో టిడిపిలో చేరతామని ప్రకటన చేశారు. తీగల ఈ ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఈ యొక్క బూతు సంభాషణ ఆడియో బయటకు ప్రత్యక్షమైంది.దీంతో తీగలను బద్నాం చేయడానికే కావాలనే పాత ఆడియోను బయటపెట్టారనే టాక్ వస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments