తెలంగాణ

జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించగా.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. జనవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి మూడు దశల్లో ఎన్నికలు పూర్తిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కులగణన 95శాతానికి పైగా పూర్తిచేసిన ప్రభుత్వ యంత్రాంగం డాటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది. వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే అవకాశముంది. కులగణన సర్వే అధారంగా బీసీ రిజర్వేషన్లను పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది.

ఈ ఏడాది జనవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. గత 10 నెలలుగా రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పాలకమండళ్లు లేకపోవడంకో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కులగణన తర్వాత లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించగా.. జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరణ చేస్తున్నది.

రాష్ట్రంలో 32 జిల్లాలు, 538 మండలాల పరిధిలో మొత్తం 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,67,33, 584 ఓటర్లు ఉండగా.. అందులో పురుషు ఓటర్లు 82,04,518 మంది, మహిళా ఓటర్లు 85,28,573 మంది, ఇతర ఓటర్లు 493 మంది ఉన్నారు. ఒక దశలో నాలుగు వేల పంచాయతీల చొప్పున మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో లేని ఈ నిబంధనను పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయడంపై రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాసేవకు పిల్లల నిబంధన ఎందుకని నాయకులు కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు అంశాలపై వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాడ్ చట్టంలో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button