
నల్లగొండ నిఘా,క్రైమ్ మిర్రర్:- గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును, వినియోగించుకునేలా పటిష్ట భద్రత కల్పించాలని, జోన్-ఆరు డీఐజి ఎల్ఎస్.చౌహన్ అన్నారు. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా, దేవరకొండలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి, ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అధికారులు పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన బాధ్యతలపై అవగాహన కల్పించారు. జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, సాగేందుకు అదనపు పోలీస్ బందోబస్తు, నిరంతర గస్తీ, పర్యవేక్షణ, సమస్యాత్మక ప్రాంతాల్లో, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డీఐజి ఆదేశించారు. అలాగే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలతో సమన్వయం పెంచుతూ, ఓటర్లకు పూర్తి భద్రతా భరోసా కల్పించాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రజలు భయాందోళనలు లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Read also : మహేశ్వరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ భద్రత ఏర్పాటు : అడిషనల్ డీసిపీ సత్యనారాయణ
Read also : Own House Dream: మీ జీవితాన్ని మార్చే 7 రోజుల పరిహారం.. సొంతిల్లు ఖాయం!





