తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ యుద్ధం ప్రకటించింది. సినీ ప్రముఖలంతా ట్వీట్లు, బైట్ల ద్వారా కొండాను కడిగిపారేస్తున్నారు. కేటీఆర్, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు వార్నింగ్ ఇస్తే.. మరికొందరు క్షమాపణకు డిమాండ్ చేశారు. కాని ఇంత జరుగుతున్నా కొండా సురేఖ కామెంట్లపై టాలీవుడ్ టాప్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం స్పందించలేదు. మెగాస్టార్ చిరంజీవి ఖండిస్తూ ప్రకటన చేసినా పవన్ మాత్రం నోరు మొదపడం లేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పవన్ కళ్యాణ్ తీరుపై తెలుగు సినీ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
ఇటీవలే తిరుమల లడ్డూ విషయంలో తీవ్రంగా స్పందించారు గబ్బర్ సింగ్. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, సనాతన ధర్మానికి భంగం కలిగించినా తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అయినా టాలీవుడ్ పెద్దలెవరు తిరుమల లడ్డూ విషయంలో మాట్లాడలేదు. కాని ఇప్పుడు సమంత, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ పెద్దలంతా స్పందించారు. తీవ్రంగా ఖండించారు. కాని ఇంతవరకు పవన్ స్పందించలేదు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో అందరూ స్పందించాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్.. సొంత పరిశ్రమపై మచ్చ వేసినా ఎందుకు ఆయన నోరు మెదపలేదని టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రశ్నిస్తోంది. పవన్‌కల్యాణ్ ఎందుకిలా తయారయ్యారని నిలదీస్తోంది.కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తనకున్న అనుబంధం కారణంగానే కొండా సురేఖ వ్యవహారంపై తమ్ముడు ఏమీ మాట్లాడలేదనే చర్చ సాగుతంది. రేవంత్ కళ్లలో ఆనందం కోసం పవన్ సైలెంట్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.