క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ సీనియర్ రాజకీయ నేత కె. కేశవరావుకు రేవంత్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన్ను నియమించారు. కేబినెట్ హోదాతో ఆయన్న పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేకేకు ఉన్న రాజకీయ, పరిపాలనపరమైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆయన్ను సలహాదారుగా నియమించినట్లు తెలిసింది. కాగా, కేకే గతంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ను కేసీఆర్ రెండు సార్లు రాజ్యసభకు నామినేట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారు.
Read Also : బీఆర్ఎస్‌కి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
ఈ మేరకు పార్లమెంట్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. అనంతరం నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీని వీడి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ పదవికి కూడా కేకే రాజీనామా చేశారు. తాను కాంగ్రెస్ మనిషిని.. కాంగ్రెస్ తనకు సొంతిల్లు వంటిదని ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వెల్లడించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందు వల్ల నైతిక విలువలతో ఆ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని అందుకే పార్టీ మారినట్లు తెలిపారు. కాగా, పార్టీ మార్పు సమయంలోనే ఆయనకు కీలక పదవి వస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్లుగానే కేబినెట్ హోదాతో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
ఇవి కూడా చదవండి :
- తెలుగు రాష్ట్రాలకు నేడు బిగ్ డే.. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ!!
- అట్లుంటది మనతోని.. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!
- ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు.. పట్టించుకోని మండల విద్యాధికారి
- హత్నూర మండల బిఎస్పి పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ పార్టీకి రాజీనామా…
- హైదరాబాద్ శివారులో పోలీసుల కాల్పులు.. నలుగురు పార్థి గ్యాంగ్ సభ్యుల అరెస్ట్