తెలంగాణ

కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టగా.. అక్కడ సత్ఫలితాలను ఇవ్వటంతో తెలంగాణలో అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే కర్ణాటకలో ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. కేఎస్‌ఆర్టీసీ భారీగా నష్టాల్లో కూరుకుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం రూ.295 కోట్ల భారీ లాస్‌లో అక్కడి ఆర్టీసీ ఉన్నట్లు వార్త కథనాలు వచ్చాయి. అందుకు సంబంధించి ఓ నేషనల్ మీడియా తమ వెబ్‌సైట్‌లో వార్తను ప్రచురించింది. కర్ణాటక ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు రెడీ అయినట్లు వార్తలో వెల్లడించింది. ఆ వార్తను ట్విట్టర్‌లో షేర్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Also Read : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు!!!

తెలంగాణలోనూ ఇదే పరిస్థితి వస్తుందని చెప్పారు. బస్సు ఛార్జీలను పెంచే యోచనలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఉందని చెప్పారు. ఛార్జీల పెంపుకు ఎంతో దూరం లేదని అన్నారు. ఉచితం అని మీకు చెప్పారంటే.. దానికి ఎప్పుడైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణ ఆర్టీసీ కూడా కర్ణాటక బాటలో నడిచి బస్సు ఛార్జీలను పెంచే రోజు ఎంతో దూరంలో లేదు.’ కేటీఆర్ ట్వీట్ చేశారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. జీరో టికెట్ తీసుకొని రాష్ట్రం నలుమూలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆయా బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు 12 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే.. ఇప్పడా సంఖ్య దాదాపు 30 లక్షలకు చేరుకుంది. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి : 

  1. రోడ్డుపై వింత చేపలు.. చూసేందుకు ఎగబడిన జనం!!
  2. యదాద్రిలో ప్రారంభమైన వన మహోత్సవం, గిరిప్రదక్షిణ…
  3. అర్థరాత్రి బిజెపి నాయకుల అక్రమ అరెస్టు…
  4. తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ!!
  5. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!

Related Articles

Back to top button