తెలంగాణ

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

తప్పు చేస్తే పెద్దపెద్దవాళ్లే జైలుకు వెళ్లారు కేటీఆర్ ఎంత అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదన్నారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి రెండ్రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు కోమటిరెడ్డి. తప్పు చేస్తే పెద్దపెద్ద వాళ్లే జైలుకు వెళ్లారు ఇక కేటీఆర్ ఎంత? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పాదయాత్ర సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కేటీఆర్, హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి లేదన్నారు.

మద్యం పాలసీ కేసులో అరెస్టైన కవితకు బెయిల్ వస్తుందని ముందే తెలియడంతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు రెండు రోజులు ముందే ఢిల్లీకి వెళ్లారని కోమటిరెడ్డి తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు వేడుకలను మూసీ నది పక్కన చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఉద్యమం సమయం నుంచి నాటకాలు ఆడుతూనే ఉన్నారని మండిపడ్డారు.

ఉద్యమం సమయంలో తనకు అగ్గిపెట్టె దొరకలేదని హరీశ్ రావు అన్నారని ఆ రోజు మనం నమ్మి ఉండవచ్చు… కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మూసీ ప్రక్షాళన చేస్తామంటే డోజర్లకు అడ్డం పడతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని అలా వస్తే వారి మీది నుంచి డోజర్లను పోనిస్తామని హెచ్చరించారు. తనను జైలుకు పంపిస్తే యోగా చేసి, పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్యానించారు. పదేళ్లు సమయం ఇచ్చినా మూసీని ప్రక్షాళన చేయని బతుకు ఎందుకని ధ్వజమెత్తారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

మరిన్ని వార్తలు చదవండి .. 

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button