తెలంగాణ

ఉపాధ్యాయ బదిలీల్లో అవకతవకలు.. పట్టించుకోని మండల విద్యాధికారి

క్రైమ్ మిర్రర్, శంకర్ పల్లి : ఎస్ జి టి ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులో ప్రిపరెన్షియల్ కేటగిరి ఉపాధ్యాయుల ధృవ పత్రాలను పరిశీలించకుండానే వెబ్సైట్లో ప్రదర్శితమవుతున్న జాబితపై బాద్యత రాహిత్యంగా ఉన్న మండల విద్యాధికారి విద్యాశాఖ అధికారుల పట్ల ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నారు. శంకరపల్లి మండల విద్యాధికారికి ఏ సమస్య చెప్పాలని ప్రయత్నం సమయానికి లేకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయక పోవడం ఎన్నో అనుమానాలకు తావునిస్తుంది. ఈ తతంగం అంతా విద్యాధికారి సమక్షంలోనే జరుగుతుందిని ఉపాధ్యాయులు, శంకర్పల్లి మండల ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఎవరైన తప్పుడు పత్రాలు పెట్టినట్లయితే వారిపై, వారికి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసు పెట్టాలని, ఇప్పటికైన పనితీరులో మార్పు రాకుంటే జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుళ్తాం అని శంకర్ పల్లి మండల టి యూ టి ఎఫ్ అద్యక్షులు వి. సుదర్శన్, ప్రధానకార్యదర్శి వి. శ్రీనివాసచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏం డి. మునీర్ పాషా తెలియచేశారు.

Read Also : అట్లుంటది మనతోని.. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!

అదేవిధంగా మూతపడినటువంటి పాఠశాలలు తెరిచి విద్యా వ్యవస్థనును పటిష్ట పరచాలని, అందరికి విద్య అందే విధంగా చూడాలనే ఉద్దేశంతో స్వయంగా గౌరవముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రకటించిన తరువాత ట్రాన్సఫర్లలో పాఠశాలలోని అన్ని ఏస్ జి టి ఖాళీలను వేకెన్సీ లిస్ట్ లో చూయించకపోవడం వలన ఉపాధ్యాయులు ఆందోలన చెందుతున్నారు. కావున అన్ని ఎస్ జి టి ఖాళీలను ట్రాన్స్ఫర్లో చూయించాలని టి యూ టి ఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము అని వారు తెలియచేశారు. అలాగే నకీలి వైద్యదృవ పత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తసుకోవాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు కె. నారాయణ, మండల నాయకులు బి. దేవేందర్ రెడ్డి, నరెందర్ రెడ్డి వెంకటేశ్వర రావు, జగదేష్, కిరణ్ కుమార్ యాదవ్, వరప్రసాద్ తదితరులు పాల్గోన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలుగు రాష్ట్రాలకు నేడు బిగ్‌ డే.. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ!!
  2. హత్నూర మండల బిఎస్పి పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ పార్టీకి రాజీనామా…
  3. 10 ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా?.. ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
  4. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ.. ఆమె జుడీషియల్ కస్టడీని పొడగించిన రౌస్ అవెన్యూ కోర్ట్!!
  5. సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్

Related Articles

Back to top button