తెలంగాణ

ఆరు రెడ్డి కుటుంబాల సంగతి తేలుస్తా.. నల్గొండలో గర్జించిన తీన్మార్ మల్లన్న

బీసీ గళంతో జనంలోకి వెళుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరింత దూకుడు పెంచారు. బీసీల కోసం ఎంతవరకైనా పోరాడుతానని చెప్పిన మల్లన్న.. రెడ్డి నేతలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. రెడ్ల ఓట్లు తనకు అవసరం లేదని గతంలో కామెంట్ చేసిన మల్లన్న.. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన బీసీల సమావేశానికి హాజరైన తీన్మార్ మల్లన్న.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెడ్డి లీడర్లపై విరుచుకుపడ్డారు.

ఏ నల్గొండ జిల్లా నుండి బీసీలను అణిచివేశారో.. అదే నల్లగొండ గడ్డ నుండి అగ్రకులాలకు చరమ గీతం పాడబోతున్నామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. అగ్రకులాల ఓట్లు తనకొద్దని తాను చెప్పానని.. బీసీల ఓట్లు మాకొద్దంటూ అగ్రకులాల వాళ్లు చెప్పగలరా? అని రెడ్డి లీడర్లకు సవాల్ విసిరారు. బీసీలంతా ఏకం అయ్యారని.. భవిష్యత్తులో బీసీలకే ఉన్నత పదవులు దక్కుతాయన్నారు. తమను బీసీలుగా గుర్తించేందుకు 50 ఏళ్లకాలం పట్టిందన్న మల్లన్న.. బీసీ కుల గణన చేపట్టాలన్న రాహుల్ గాంధీ మాటను తాను స్వాగతిస్తున్నానని..గౌరవిస్తున్నానని తెలిపారు. మోడీజీ గింతీ కరో నైతో కూర్చి ఖాళీ కరో అని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : పవన్‌ను అడ్డుకోవడంతో రాజమండ్రిలో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మరోసారి కామెంట్ చేశారు తీన్మార్ మల్లన్న. రాబోయేది బీసీ ముఖ్యమంత్రేనని జోస్యం చెప్పారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు బీసీలకే దక్కాలని కోరారు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి బీసీ బిడ్డ బీసీ కే ఓటు వేయాలని కోరారు. పాలకులు పందికొక్కుల తీరు ప్రాజెక్టుల పేరు మీద పైసలు దోసుకుంటున్నారని దుయ్యపట్టారు. ఆరు గ్యారంటీల సంగతి నాకొద్దు కానీ నల్లగొండ జిల్లాలో ఆరు రెడ్డి కుటుంబాల సంగతి నాకు కావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో జానారెడ్డి కుటుంబం నుండి ఒక రక్తపు బొట్టు అయిన నేలకొరిగిందా అని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్, బెల్లి లలిత త్యాగాల ముందు మీ త్యాగాలు ఎంత అని చురకలేశారు.29 జీవోతో ఈ డబ్ల్యూ సి ఉద్యోగాలు ఎత్తుకెళ్తున్నారని విమర్శించారు.ఓసి లో ఉన్న పేద పేద బిడ్డలకు ఈడబ్ల్యుసి రిజర్వేషన్ దక్కాలన్నారు.మిర్యాలగూడ ఆర్యవైశ్యులారా బీసీలతో కలిసి రండి మీ ఎమ్మెల్యే స్థానాలను పెంచుకోండి అని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి .. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button