
అసెంబ్లీలో రోజుకో తరహా నిరసనతో హంగామా చేస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.ఇవాళ స్కూటీలతో ఆందోళన చేశారు. ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినట్లు బాలికలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా..ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని కవిత ఆరోపించారు. తులం బంగారం ఇయ్యమని శాసనమండలి సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారని తెలిపారు.
తులం బంగారం ఎగ్గొట్టినట్లే ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టే పని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కవిత విమర్శించారు. లక్ష 50 వేల కోట్ల అప్పు చేసి కూడా హామీలు విస్మరించారని అన్నారు.ప్రియాంక గాంధీకి పోస్ట్ కార్డులు రాస్తున్నారు విద్యార్థినీలు..ఇప్పటికైనా ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మాట తప్పడం , మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమి.. అన్ని వర్గాలను వంచించినట్టు విద్యార్థులను మోసం చేశారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.
Read More : ఉస్మానియా జోలికొస్తే బొందపెడతం.. సీఎం రేవంత్‌కు బీజేపీ వార్నింగ్
స్టేషన్ ఘన్పుర్ సభలో తాము ఇచ్చిన హామీలు అమలు చేయలేమని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలన్నారు. దేశంలో అనేక పార్టీలు అనేక హామీలు ఇస్తాయి..కానీ చెప్పని హామీలు సైతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమేనని ఆయన చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.కేసిఆర్ గారి ప్రభుత్వం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని.. కాని మళ్ళీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుందని చారి ఆవేదన వ్యక్తం చేశారు.