క్రీడలు

రంజీల్లో కోహ్లీ ఒక్కరోజు జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపుగా 13 ఏళ్ల తర్వాత రంజి ట్రోఫీలో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక చివరిసారిగా 2012లో విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్లు ఆడాడు. ఆ తరువాత కోహ్లీ తన ఆట తీరుతో టీమిండియా కు సెలెక్ట్ అవడం, అక్కడ ఎన్నో మ్యాచ్లను తను గెలిపించడం చక చక జరిగిపోయాయి. టీమిండియా కెప్టెన్ గా ఎన్నో మ్యాచ్లను ఒంటి చేతితో గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మ్యాచ్లను గెలిపించడంతోపాటుగా ఎన్నో ట్రోఫీలను కూడా అందించాడు.

మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం..

అయితే తాజాగా రంజి ట్రోఫీలో భాగంగా ఢిల్లీ టీంకు ఆడుతున్న విరాట్ కోహ్లీకి మొదటిరోజు విరాట్ కోహ్లీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ స్టేడియంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఆ కేకలు అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం అందరిలోనూ ఒక రంజి మ్యాచ్ ఆడినందుకు రోజుకి ఎంత డబ్బును ఇస్తారు అనేది అందరిలోనూ ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఇక తాజాగా విరాట్ కోహ్లీ ఒక్కరోజు మ్యాచ్ ఆడినందుకు ఏకంగా 60 వేల రూపాయలు పారితోషకం అందుకుంటారు. కాగా నాలుగు రోజులపాటు విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా మొత్తం 2 లక్షల 40 వేల రూపాయల వరకు విరాట్ కోహ్లీ పారితోషికం తీసుకోనున్నారు.

పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌

అయితే రంజి ట్రోఫీలో అరంగేట్రం చేసిన ప్లేయర్కు ఒక్క రోజుకి 20వేల నుంచి 30 వేల రూపాయల వరకు ఇస్తారు. అదే దాదాపుగా 20 పైగా మ్యాచులు ఆడితే ఆ వ్యక్తికి 40 వేల రూపాయలు నుంచి 50 వేల రూపాయల వరకు ఇస్తారు. ఇక ఆ తరువాత 40కి పైగా మ్యాచ్ లాడిన ప్లేయర్ కి 60 వేలకు పైగా పారితోషకం ఇవ్వనున్నారు. కాబట్టి విరాట్ కోహ్లీ నాలుగు రోజుల్లోనే 2,40,000 వరకు పారితోషకం తీసుకోమన్నారు.

DGP ద్వారక తిరుమలరావు పై గౌరవం చూపిన అధికారులు ?

Back to top button