తెలంగాణ
Trending

అద్దంకి దయాకర్ సినిమా టైటిల్ ఫిక్స్.. పాన్ ఇండియా సినిమాకు పవర్ ఫుల్ టైటిల్!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సాధారణంగా అయితే.. సినిమాల్లో రాణించి.. ఓ స్థాయికి చేరుకున్న తర్వాత నటీనటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఉద్యమకారుడు, రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అద్దంకి దయాకర్.. ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా హీరోగా.. పాన్ ఇండియా సినిమాతో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న అద్దంకి దయాకర్ ప్రధాన పాత్రదారిగా.. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ఐదు భాషల్లో నిర్మిస్తున్నారు.

బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాల నేపథ్యంలో తెరక్కిన ఈ సినిమాకు చిత్రబృందం పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు “ఇండియా ఫైల్స్” అనే టైటిల్‌ను మూవీ టీం ఫిక్స్ చేశారు.ఈ మేరకు సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను అద్దంకి దయాకర్ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేశారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు పూర్తికాగా.. సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.. హీరో అద్దంకి దయాకర్.

Also Read : అలాంటి వాళ్లే రాజకీయాల్లో ఎక్కువగా ఉన్నారు.. మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు!!

ఈ సినిమాకు.. ‘ఆస్కార్’ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. ఇప్పటికే గద్దర్ పాడి, ఆడిన పాట విడుదలై మంచి ఆదరణ పొందింది. అయితే.. జులై 10న అన్ని పాటలను విడుదల చేయనున్నట్టు తెలిపారు. 5 భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు తెలిపిన అద్దంకి దయాకర్.. ఈ కార్యక్రమానికి శ్రేయోభిలాషులందరరికీ ఆహ్వానం పలుకుతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల్లో తెలిపారు. అయితే.. ఈ సినిమాలో అద్దంకి దయాకర్ సరసన.. ప్రముఖ నటి ఇంద్రజ నటిస్తుండగా.. బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ లాంటి పలువురు రాజకీయ నేతలు నటిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. ప్రజా యుద్ధ నౌక గద్దర్, సీనియర్ నటుడు శుభలేక సుధాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. అయితే.. ఈ సినిమాలో అద్దంకి దయాకర్ హీరోగా నటిస్తుండగా.. ఆయన జీవితంలోని కీలక ఘట్టాలను తెరకెక్కించినట్టు సమాచారం. విద్యార్థి నాయకుడిగా చేసిన ఉద్యమాలు, ప్రేమ, తెలంగాణ ఉద్యమంతో అద్దంకి పాత్ర, దేశంలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు, రాజ్యంగానికి సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించేలా ఈ సినిమాను మలిచినట్టు.. అద్దంకి దయాకర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Read Also : డిఫాల్ట్ బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌.. శుక్రవారానికి వాయిదా!!

ఈ సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లు గడుస్తుండగా.. అటు రాజకీయ వర్గాల్లో, ఇటు అద్దంకి దయాకర్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. మధ్యలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగటం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగటంతో.. సినిమాకు సంబంధించిన పనులు ఆలస్యమయ్యాయి. ఎన్నికలు పూర్తవటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు.. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు “ఇండియా ఫైల్స్” అనే టైటిల్ ఫిక్స్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే.. కేరళ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు విడుదల కాగా.. అవి దేశంలో వివాదాలకు కారణమయ్యాయి. కాగా.. ఇప్పుడు అదే పంథాలో ఏకంగా “ఇండియా ఫైల్స్” అనే టైటిల్‌తో అద్దంకి దయాకర్ పెద్ద సాహసమే చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమాలో ఎలాంటి కథను ప్రేక్షకులకు చెప్పనున్నారన్నది తెరపై చూసేందుకు మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి : 

  1. గాంధీభవన్‌లో ఘనంగా వైఎస్‌ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన సీఎం, డిప్యూటీ సీఎం!!!
  2. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా భేటీ.. నేడో, రేపో కాంగ్రెస్‌లో చేరే అవకాశం!!
  3. తెలంగాణలో నామినేటెడ్‌ పదవుల భర్తీ.. 37 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం!!
  4. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ…
  5. పదవి కాలం పూర్తి చేసుకున్న జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డికి ఘన సన్మానం…

Back to top button