అంతర్జాతీయంతెలంగాణ

అట్లుంటది మనతోని.. బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపిన కల్వకుంట్ల హిమాన్షు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బ్రిటన్‌లో 14 ఏళ్ల తర్వాత అధికారం పార్టీ మారుతోంది. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుని.. కన్జర్వేటివ్ పార్టీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో.. ఇన్నాళ్లు ప్రధానిగా ఉన్న రిషి సునాక్ స్థానంలో.. లేబర్ పార్టీ నాయకుడు అయిన కైర్ స్టార్మర్ బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ కొత్త ప్రధాని కైర్ స్టార్మర్‌‌కు.. ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా కైర్ స్టార్మర్‌కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు కూడా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టగా.. కైర్ స్టార్మర్‌తో గతంలో దిగిన ఫొటోను హిమాన్షు పంచుకున్నారు. “యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు కైర్ స్టార్మర్‌కు అభినందనలు.

Read Also : తెలుగు రాష్ట్రాలకు నేడు బిగ్‌ డే.. ముఖ్యమంత్రుల సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ!!

లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో అకడమిక్ స్టడీలో భాగంగా ఆయనను కలుసుకుని ముచ్చటించటం నాకు గౌరవంగా ఉంది.” అంటూ.. కైర్ స్టార్మర్‌ను కలిసిన సందర్భాన్ని హిమాన్షు పంచుకున్నాడు. కాగా.. ప్రస్తుతం హిమాన్షు విదేశాల్లో ఉన్నత చదువు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. హిమాన్షు చేసిన పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అట్.. ఇదీ మన చిన్న బాబు రేంజ్..” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. “ఇది అద్భుతం..! బ్రిటన్ ప్రధానమంత్రిగా గెలిచిన వ్యక్తిని కలవడం ఒక అద్భుతమైన అనుభవం. కైర్ స్టార్మర్‌ను కలిసి సమయంలో ఏం చర్చించారు..?” అంటూ మరో నెటిజన్ ఆసక్తిగా అడిగాడు. కాగా.. “మీ తండ్రిలాగే మీరు కూడా..” అంటూ కొనియాడాడు మరో నెటిజన్. “అంతర్జాతీయ ప్రముఖులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా బాగుంది, మీకు శుభాకాంక్షలు” అంటూ మరో వ్యక్తి స్పందించాడు. ఇంకొకరు మాత్రం.. “అట్లుంటది మనతోని..” అంటూ డీజే టిల్లు డైలాగుతో కామెంట్ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి : 

  1. 10 ఎకరాల లోపు రైతులకే రైతు భరోసా?.. ముగిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం
  2. హత్నూర మండల బిఎస్పి పార్టీ అధ్యక్షుడు పవన్ కుమార్ పార్టీకి రాజీనామా…
  3. ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ.. ఆమె జుడీషియల్ కస్టడీని పొడగించిన రౌస్ అవెన్యూ కోర్ట్!!
  4. తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈఓ)గా సుదర్శన్ రెడ్డి
  5. సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్

Related Articles

Back to top button