Monday, February 23, 2026
Homeక్రైమ్అక్క,చెల్లి ఇద్దరు కావాలి.. వీడియోలతో బ్లాక్ మెయిల్

అక్క,చెల్లి ఇద్దరు కావాలి.. వీడియోలతో బ్లాక్ మెయిల్

ప్రేమ పేరుతో ఇద్దరు మైనర్లను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ఘట్కేసర్ లో కలకలం సృష్టించింది. అక్కను ట్రాప్ చేసిన యువకుడు అవినాష్ రెడ్డి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టాడు. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అవినాష్ తో ఫొటోలు, వీడియోలు దిగారు. చివరకు తనకు ప్రియురాలి చెల్లెలు కావాలంటూ అక్కను బ్లాక్ మెయిల్ కు దిగాడు అవినాష్.

ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వస్తే ఫొటోలు, వీడియోలు డిలీట్ చేస్తానని అవినాష్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశాడు. తప్పనిసరి పరిస్థితిలో వాటిని తీసుకెళ్లి ఇచ్చింది. చివరకు చెల్లెలిని కూడా తీసుకురావాలని బెదిరించడంతో ఏం చేయాలో తెలియక అక్క ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మైనర్ల తండ్రి తిరుమల రెడ్డి ఫిర్యాదుతో ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments