మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ దగ్గర వివాదం జరిగింది. శుక్రవారం ఫుడ్ పాయిజాన్ కావడంతో 100కు పైగ విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో 10 మందికి సీరియస్ కావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు లోనయ్యారు. శ్రీ చైతన్య కాలేజీ దగ్గరకు చేరుకుని ఆందోళన చేశారు.
శ్రీ చైతన్య కాలేజీ దగ్గర పలు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్ధి సంఘానికి, శ్రీ చైతన్య సిబ్బందికి పరస్పర వాగ్వాదానికి దిగారు. ఒకరి పై ఒకరు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్ధి సంఘం నాయకులను మాదాపూర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. లక్షల రూపాయలు తీసుకుంటూ నాసిరకం భోజనం పెడుతున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.