క్రైమ్

శంషాబాద్ లో ఏడాది చిన్నారి మిస్సింగ్.. ప్రత్యేక బృందాలతో గాలింపు

శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సంవత్సరం చిన్నారి అదృశ్యమైంది. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ వెనకాల నివాసం ఉండే స్వాతి కుమారుడు ఈశ్వర్ (1) కనిపించకుండా పోయాడు. రాత్రి పాలుపట్టించిన అనంతరం అందరు నిద్రపోయారు‌. ఉదయం నిద్రలేచి చూసే సరికి బాబు కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికినా బాబు ఈశ్వర్ ఆచూకీ దొరకలేదు. ఆర్జీఐఏ పోలీసులను ఆశ్రయించి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. బాబు ఆచూకీ గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Back to top button