తెలంగాణమహబూబ్ నగర్

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా??.. పార్టీ మారేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు తగులతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కారు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా.. మరో ఎమ్మెల్యే పార్టీ మారేందుకు సిద్ధమయ్యాయి. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై తొలిసారిగా బండ్ల స్పందించారు. పార్టీ మారాలంటూ తన అనుచరుల నుంచి ఒత్తడి వస్తోందని చెప్పారు. అయితే మండలాలవారీగా ప్రజల అభిప్రాయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Read Also : ములుగు జిల్లాను రామప్ప ములుగు జిల్లాగా ప్రకటించాలి.. రామప్ప పరిరక్షణ కమిటీ

అందరి అభిప్రాయం తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే బండ్ల స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మార్పు ఆలోచన ఉందని.. అది కూడా అందరి నుంచి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు దక్కించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటంతో పట్టు పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత మంత్రి జూపల్లికి సన్నిహితుడిగా పేరున్న బండ్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 

  1. ఫలక పగిలింది.. కేసు బుక్ అయ్యింది.. వివరాలు వెల్లడించిన సీఐ ఆంజనేయులు
  2. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
  3. విద్యార్దులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలి.. అదనపు కలెక్టర్ శ్రీజ
  4. సెక్రటేరియట్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ.. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి !!
  5. పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు.. బీఎన్‌ఎస్ యాక్ట్‌లో కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా రికార్డు!!

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button