క్రైమ్

ప్రీ లాంచింగ్‌ పేరుతో ఛీట్..150 కోట్ల మోసం

హైదరాబాద్ లో మరో రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీ లాంచింగ్‌ పేరిట ఆర్జే వెంచర్స్‌ తమను మోసం చేసిందంటూ బషీర్‌బాగ్‌ సీసీఎస్‌ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. నారాయణ్‌ఖేడ్‌, ఘట్కేసర్‌, పఠాన్‌ చెరు, కర్తనూర్‌ ప్రాంతాలలో అపార్ట్‌మెంట్‌, ఫార్మ్‌ ల్యాండ్‌ పేరిట ఆర్జే వెంచర్స్‌ ప్రముఖులతో ప్రకటనలు చేయించింది. 2020లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 నుంచి 50 లక్షలు కట్టామని బాధితులు తెలిపారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆరోపించారు.

ఆర్జే వెంచర్స్‌ ఎండీ భాస్కర్‌ గుప్త, డైరెక్టర్‌ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది 150 కోట్ల రూపాయలు కట్టినట్లు వివరించారు. తాము ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, గట్టిగా అడిగితే చెక్కులు ఇచ్చారని, అవి కూడా బౌన్స్‌ అయ్యాయని తెలిపారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

Spread the love
Back to top button