క్రైమ్
Trending

పేరుకే ఆయుర్వేదిక్ .. చేసేది అలోపతి.. ఇదీ కొత్తూరు వైద్యుడి వైనం

  • మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారం
  • పనికోసం వచ్చిన గిరిజన బాలికపై భూయజమాని దాష్టీకం..
  • రంగారెడ్డి జిల్లా ఎర్రకుంట తండాలో దారుణం
  • బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించిన నీచుడు
  • కొత్తూరు (షాద్ నగర్) లో అబార్షన్‌!
  • కొత్తూర్ లోని శ్రీనివాస క్లినిక్ వైద్యుడు రంజిత్ గర్భం తీసేశాడు
  • పరారీలో కొత్తూరు వైద్యుడు రంజిత్

క్రైమ్ మిర్రర్, శంషాబాద్ : మహిళలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కీచకులు చిన్నా, పెద్దా తేడాలేకుండా తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నారు. చిన్నారులు, యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఎర్రకుంట తండాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు ఆ దుర్మార్గుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అసలేం జరిగిందంటే.. తండ్రితో కలిసి పనికి వెళ్లి గిరిజన బాలికపై ఓ కామాంధుడు కన్నేశాడు. ఆమెపై కన్నేసిన భూయజమాని కృష్ణారెడ్డి(30) బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. బాలికను ఆ యజమాని కొత్తూరుకు తీసుకెళ్లాడు. ప్రాణానికి ముప్పు ఉంటుందని తెలిసినా వైద్యుడికి డబ్బు ఇచ్చి అబార్షన్ చేయించాడు. ఈ విషయం బయటకు పొక్కకుండా మంగళవారం తన వ్యవసాయ క్షేత్రంలో తండా, గ్రామపెద్దలను కూర్చోబెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఎలాగో తప్పు జరిగిందని.. ఎంతో కొంత ఇచ్చి రాజీ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. బాలిక డబ్బులకు లొంగలేదు. మంగళవారం సాయంత్రం శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొత్తూర్ గ్రామంలోని శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ రంజిత్ రెడ్డి గర్భం తీసేసినట్లు తెలిసింది. నిందితుడు కృష్ణారెడ్డితో పాటు డాక్టర్ రంజిత్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చెప్పేది హోమియోపతి.. చేసేది హలోపతి : షాద్ నగర్ నియోజక వర్గంలోని కొత్తూర్ గ్రామంలో శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ రంజిత్ రెడ్డి గర్భం తీసేసినట్లు శంషాబాద్ పోలీసులు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం వైద్యుడు రంజిత్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. కొత్తూరులో శ్రీనివాస హాస్పిటల్ పేరిట వైద్యం చేస్తున్నాడు. గతంలో ఫిబ్రవరి 27న రంజిత్ ఆసుపత్రిని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి తనిఖీ చేశారు. ఆయుర్వేదిక్ చికిత్స మాత్రమే చేయాలి అలోపతి చేయకూడదని నోటీసు కూడా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఫార్మసిస్టును కూడా పెట్టుకోవాలని నిబంధనలు జరిచేశారు. ఇక్కడ ఎవరి పేరు అయితే రిజిస్టర్ చేయబడిన వైద్యుడు లేక వైద్యురాలు ఉన్నారో వారి చేతనే చికిత్స చేయించాలని నోటీసులో పేర్కొన్నారు. కానీ రంజిత్ చేసే చర్యలు మాత్రం ఆయుర్వేదిక్ కాకుండా అలోపతి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మైనర్ బాలిక అబార్షన్ ఈ ఆస్పత్రిలో జరిగింది. శంషాబాద్ పోలీసులకు వైద్యుడు రంజిత్ చికితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.
ఎవరైనా మీడియా ప్రతినిధులు ఇతనిని ప్రశ్నిస్తే వారి ప్రధాన కార్యాలయాలకు ఫోన్లు చేయించి వారిచేత హుకుంలు జారీ చేయించే రకం ఇతడని స్థానికులు చెబుతున్నారు.

Related Articles

Back to top button