ఆంధ్ర ప్రదేశ్

దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్?

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వర్మ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కల్పించాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. అరెస్ట్ నుంచి తాము రక్షించలేమని వర్మ న్యాయవాదికి కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది.

గత ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఆ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా వర్మ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రాంగోపాల్ వర్మ. సినిమాలో సైతం వీరిని కించపరిచే పలు సన్నివేశాలు ఉన్నాయి.ఈ క్రమంలో వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన టీడీపీ నేత రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ విచారణకు హాజరుకావాలంటూ హైదరాబాద్ లో ఉన్న వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం బుధవారం పోలీసు విచారణకు వర్మ హాజరు కావాల్సి ఉంది.ఈ నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఒంగోలు లో పోలీసుల విచారణ కు ఈరోజు రావాల్సి ఉంది రాంగోపాల్ వర్మ. అయితే తాను ఈరోజు రాలేనని, వారం రోజులు గడువు ఇవ్వాలని వాట్సాప్ ద్వారా అధికారులను కోరారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ . ముందుగా నిర్ణయించిన షూటింగ్స్ ఉన్నాయని వివరణ ఇచ్చారు.దీంతో రేపటి పోలీసు విచారణకు హాజరు కావాలని హైకోర్టు వర్మను ఆదేశించింది.

Back to top button