తెలంగాణమహబూబ్ నగర్

రోడ్డుపై వింత చేపలు.. చూసేందుకు ఎగబడిన జనం!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రెండు వింత చేపలు రోడ్డుపై పాకుతున్న ఘటన మహబూబ్‌నగర్ జిల్లా పెంట్లవెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పెంట్లవెల్లి నుంచి మంచాలకట్ట వెళ్లే దారిలో ఈ చేపలు స్థానికులకు కనిపించాయి. అయితే పాములు మాదిరిగా రోడ్డుపై పాకుతూ వెళ్తున్న ఈ చేపలను చూడటానికి స్థానిక ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. చేపలు పాకుతూకుంటూ రోడ్డుపై వేగంగా వెళ్తుండటాన్ని చూసి ప్రజలు ఒకింత ఆశ్చర్యపడ్డారు. ఈ చేపల గురించి మత్స్యశాఖ ఏడీ లక్ష్మప్పకు సమాచారం అందించారు. ఈ చేపలను పరిశీలించిన ఆయన.. ఇవి సాధారణంగా నదులు, చెరువులు, కుంటలు, వాగుల్లో జీవిస్తుంటాయని చెప్పారు. ఈ చేపను గురక చేప (ఎక్కే చేప) అని కూడా అంటారన్నారు. వీటి శాస్త్రీయ నామం అనబాస్‌ టెస్టుడ్యూనియస్ అని వెల్లడించారు.

Also Read : యదాద్రిలో ప్రారంభమైన వన మహోత్సవం, గిరిప్రదక్షిణ…

సుమారుగా ఈ చేపలు 25 సెంటీ మీటర్ల వరకు పెరుగుతాయని చెప్పారు. ఇది తన తలకు ఇరువైపులా ఉన్న మొప్ప కుహరంపై ఉన్నటువంటి రంపపు వంటి ప్రత్యేకమైన పళ్ల ద్వారా నేలపై పాకుతూ ప్రయాణిస్తుందని చెప్పారు. ఇదే కాదు ఈ చేపల గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. నేలపైనే కాకుండా చెట్లును కూడా ఈజీగా ఎక్కుతాయన్నారు. ఏపీ ప్రాంతంలో మత్స్యకారులు ఆహారపు చేపగా తాము సాగు చేసే చెరువుల్లో ప్రత్యేకంగా ఈ చేపలను పెంచుతుంటారని ఆయన వెల్లడించారు. ఇక వర్షాకాలం ప్రారంభంలో చాలా వరకు చెరువులు, కుంటల్లోలో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుందని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఆ సమయంలో యాంఫీబియస్ నేచర్ ఉన్న చేపలు బలమైన ఈదురు గాలులకు గాలితో పాటు ఎగురుతాయి. వీటికి నేల మీద, నీటిపైన బతికే శక్తి ఉంటుంది. వర్షం, విపరీతమైన గాలి వచ్చిన సమయంలో ఇవి గాల్లోకి ఎగిరి మళ్లీ వర్షంతో పాటు కిందకు పడతాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. అర్థరాత్రి బిజెపి నాయకుల అక్రమ అరెస్టు…
  2. పార్టీ మారిన పట్టించుకోము.. కొత్త తరాన్ని తయారు చేస్తాం..
  3. నల్గొండ-హైదరాబాద్‌ నాన్‌స్టాప్‌ ఏసీ బస్సుల ప్రారంభం…
  4. డేంజర్.. వాటర్.. మిషన్‌ భగీరథ నీటీలో వానపాములు…!!
  5. దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రేవంత్ సర్కార్‌పై మండిపడిన కేటీఆర్!!!

Back to top button