తెలంగాణ

రేపో మాపో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్?

చండూరు, క్రైమ్ మిర్రర్ :చేనేత సహకార సంఘాలకు రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం చేనేత నాయకులతో మాట్లాడారు. చేనేత సమస్యలను పరిష్కరిస్తామని, పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామి ఇచ్చారు. కార్మికులకు పని భరోసా కల్పించడంలో భాగంగా చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు నాయకులు అయిన దృష్టికి తీసుకొచ్చారు. సహకార సంఘాలకు అతి త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు. నల్గొండ జిల్లాలో 35 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. కాగా ఒక చేనేత సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం ఐదేళ్ల లోపున ఆడిట్ నిర్వహించాల్సి ఉంది. ఇలా చూసుకుంటే జిల్లాలో చాలావరకు సంఘాలకు ఆడిట్ సరిగా లేదు . ఆడిట్ నిర్వహించడం ఐదేళ్ల లోపు ఉంటే ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నల్గొండ జిల్లా ఏడి ద్వారక్ తెలిపారు. చండూరు చేనేత సహకార సంఘానికి వచ్చేసి రెండేళ్ల నుంచి ఆడిట్ జరగలేదు అయినా ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదు.

Back to top button