క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ప్రస్తుతం ఆమె జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 25 వరకు పొడగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి.
Read Also : నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయనున్న కేకే.. కాంగ్రెస్ పార్టీలో చేరిక!!
అయితే కవిత.. ఈడీ, సీబీఐ కేసులకు సంబంధించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఈ నెల 1న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది. ఒక విద్యావంతురాలిగా పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాబట్టి ఈ కేసులో కవిత పాత్రతో పాటు ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల ఆధారంగా ఆమెకు బెయిల్ ఇవ్వాలా.. వద్దా? అనే నిర్ణయముంటుందని వెల్లడించింది. ఇక ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె పలుమార్లు కోరినా.. న్యాయస్థానంలో ఆమె చుక్కెదురైంది. మార్చి 15 నుంచి దాదాపు నాలుగు నెలలుగా ఆమె కస్టడీని పొడగిస్తూనే ఉండటంతో జైలుకే పరిమితమయ్యారు.
ఇవి కూడా చదవండి :
- నగరంలో కిడ్నాప్ గ్యాంగ్‌ల కలకలం.. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలే టార్గెట్!!
- కేబినెట్ విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ కసరత్తు.. ఎవరికి అవకాశం దక్కనుంది..??
- హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలోని ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం సిద్ధం.. మంత్రి కీలక ఆదేశాలు!!
- ఏదో ఒక రోజు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతా.. సీనియర్ నేత జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజు వసూళ్ల కాంట్రాక్ట్ నుండి వైదొలగిన జీఎమ్మార్ సంస్థ…