క్రైమ్ మిర్రర్, హత్నూర ప్రతినిధి : నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూరు గ్రామ దళితులకు చెందిన శ్మశాన వాటికకు హక్కు పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నర్సాపూర్ ఏమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కమలాద్రి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.మల్లేశం మాట్లాడుతూ తాత ముత్తాతల కాలం నుండి ఎవరైనా చనిపోతే సర్వే నంబర్ 60/అ1 విస్తీర్ణం 0.23 గుంటలలో బోందలు పెడుతున్నారని దానికి ఎటువంటి హక్కు పత్రం లేకపోవడంతో కొంతమంది రియల్టర్లు కబ్జా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా గ్రామానికి చెందిన దళితులు ఎవరైనా మరణిస్తే ఆ స్థలంలోనే బొందలు ఏర్పాటు చేసుకునేవారని గుర్తుచేశారు.
Read Also : బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన వరల్డ్ ఛాంపియన్స్
గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి దళితులకే చెందినట్లుగా తిర్మాణించి పత్రం ఇచ్చినప్పటికీ అధికారికంగా ప్రభుత్వం నుండి ఎటువంటి సర్టిఫికెట్ లేకపోవడంతో కొంతమంది రియల్టర్లు కబ్జా చేసుకోవాలని దళితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత నెలలో కలెక్టర్ కి మొరపెట్టుకున్నా నేటివరకు కనీసం పంచనామా కూడా చేయలేదని ఆగ్రహించారు. వెంటనే అధికారులు పంచనామా చేసి దళితులకు హక్కు పత్రం ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో సిపిఎం ఆద్వర్యంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు, గ్రామ దళితులు కుమార్, యాదయ్య, లచయ్య, దేవరాజు, సాలయ్య, పోచయ్య, శోభ, లక్ష్మి, యశోద, సుశీల, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తప్పదా??.. పార్టీ మారేందుకు సిద్దమైన మరో ఎమ్మెల్యే!!
- ములుగు జిల్లాను రామప్ప ములుగు జిల్లాగా ప్రకటించాలి.. రామప్ప పరిరక్షణ కమిటీ
- రేపో మాపో చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నోటిఫికేషన్?
- ఫలక పగిలింది.. కేసు బుక్ అయ్యింది.. వివరాలు వెల్లడించిన సీఐ ఆంజనేయులు
- బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఇటుక పెళ్ల కదిలించినా హైదరాబాద్‌లోని గాంధీభవన్ కూల్చేస్తాం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!