క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి!

Road accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-బస్సు ఢీకొనడంతో 18 మంది మృతి చెందింది. శ్రావణమాసం సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాల భక్తులు కన్వర్ యాత్రకు బయలుదేరారు. భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడంతో ఈ ఘోరం జరిగింది.

దేవ్ గఢ్ లో కన్వర్ భక్తుల బస్సుకు ప్రమాదం

జార్ఖండ్‌ లో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రక్‌ ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్రావణ మాసం సందర్భంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు కన్వర్ యాత్రకు వెళ్తున్నారు. అలాగే వస్తున్న భక్తుల బస్సు జార్ఖండ్‌లోని దేవ్‌ గఢ్ కు చేరుకోగానే ట్రక్‌ ‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.  అతివేగం కారణంగా డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక, ట్రక్ ను తగిలించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

Read Also: నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు, యెమెన్ సర్కారు కీలక నిర్ణయం!

Back to top button