
మద్దూర్, క్రైమ్ మిర్రర్ :-నారాయణపేట జిల్లా,మద్దూర్ పట్టణ కేంద్రంలో సెప్టెంబర్ 17 సందర్భంగా విశ్వకర్మ జయంతిని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మద్దూర్ మున్సిపాలిటీలో మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. ఎంతో సంతోషంగా ఉందని స్వర్ణకార సంఘం నాయకులు మాట్లాడుతూ అన్నారు. పూజ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు మోనేష్ చారి, రవీంద్రనాచారి, జెయింట్ సెక్రెటరీ ఆనంద్ కుమార్ చారి, సత్యనారాయణ చారి, అశోక్ గౌడ్, గోవిందు, బాలచందర్ గౌడ్, దాదా, కృష్ణమాచారి, ప్రసాద్ చారి, తదితరులు పాల్గొన్నారు.
Read also : అమ్మోరుకిచ్చిన మాట ప్రకారం ఏకంగా 151 మేకలను బలిచ్చిన డ్రైవర్!
Read also: ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. నాకు తెలుగొచ్చు : VTV గణేష్