జాతీయంవైరల్

VIDEO: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. ఊహించని పని చేసిన ఇద్దరమ్మాయిలు

సాధారణంగా పెళ్లి అంటే పందిళ్లు, బాజాభజంత్రీలు, వేదమంత్రాల నడుమ అగ్ని సాక్షిగా జరిగే ఏడడుగులు గుర్తొస్తాయి.

సాధారణంగా పెళ్లి అంటే పందిళ్లు, బాజాభజంత్రీలు, వేదమంత్రాల నడుమ అగ్ని సాక్షిగా జరిగే ఏడడుగులు గుర్తొస్తాయి. కానీ బిహార్‌లో జరిగిన ఒక వివాహం ఈ సంప్రదాయాలన్నింటికీ భిన్నంగా ఉండి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా, పురోహితుడి అవసరం లేకుండా, వంటగదిలోని గ్యాస్ స్టవ్‌ను సాక్షిగా చేసుకుని ఇద్దరు యువతులు పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వింత ఘటన బిహార్‌లోని సుపాల్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఇద్దరు యువతులు కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తమ జీవితం గురించి నిర్ణయం తీసుకోవడంలో సమాజం అభిప్రాయాన్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నామని వారు చెబుతున్నారు. అబ్బాయిలంటే తమకు ఆసక్తి లేదని, మగాళ్లతో జీవించాలన్న ఆలోచనే తమకు రాదని స్పష్టంగా వెల్లడించారు. అందుకే ఒకరికొకరు తోడుగా ఉండి జీవితాంతం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ పెళ్లిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సంప్రదాయంగా అగ్ని దేవుడి చుట్టూ తిరగాల్సిన చోట గ్యాస్ స్టవ్‌ను వెలిగించి, దాని చుట్టూ ఏడడుగులు వేయడం. వంటగదిలోనే ఒకరి చేయి మరొకరు పట్టుకుని, తాము ఇకపై భార్యాభర్తలుగా (జీవిత భాగస్వాములుగా) కలిసి ఉంటామని ప్రకటించారు. మూడు ముళ్లు, తలంబ్రాలు, బంధువుల సందడి ఏమీ లేకుండానే ఈ వివాహం పూర్తయ్యింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది ప్రేమకు సరిహద్దులు లేవని ప్రశంసిస్తుంటే, మరికొందరు సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. భారీ ఖర్చులతో ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆర్భాట వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో, ఇలా నిరాడంబరంగా, పూర్తిగా భిన్నంగా పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, తమ నిర్ణయంతో ఈ బిహార్ యువతులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.

ALSO READ: కూతురికి కడుపు చేసిన కన్న తండ్రి.. కోర్టు సంచలన తీర్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button