తెలంగాణ ఆర్టీసీ అధికారులు అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్నారు. దసరా పేరుతో దాదాపు వారం రోజుల పాటు టికెట్ రేట్లను పెంచేశారు. దసరా తర్వాత కూడా కొన్ని రూట్లలో కొనసాగించారు. తాజాగాదీపావళి పండగ పేరుతో ఆర్టీసీ … ప్రయాణీకులను నిలువు దోపిడీ చేస్తోంది. ప్రత్యేక బస్సుల పేరుతో తెలంగాణ ఆర్టీసీ దోపిడీకి పాల్పడుతోంది. దీపావళి పండుగ ముగిసిన తర్వాత కూడా స్పెషల్ బస్సులు అంటూ రేట్లు పెంచి నేటికి అమలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా కరీంనగర్ నుంచి హైదరాబాద్ లోని జేబిఎస్ కు 330 రుపాయలు టికెట్ కాగా దీపావళి పండుగ పేరుతో ప్రయాణికుల నుంచి 470 వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాకు వచ్చిన ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని కండెక్టర్లు చెబుతున్నారు. అయితే రద్దీకి తగట్టుగా బస్సులు లేవని ప్రయాణీకులు వాపోతున్నారు. దీంతో ఎక్కువ చార్జీలు పెట్టి నిలుచును ప్రయాణించాల్సి వస్తోందని పలువురు ఆర్టీసీ తీరుపై మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి ..
- 1,000 కోట్లు లాస్.. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్
- ఆరు రెడ్డి కుటుంబాల సంగతి తేలుస్తా.. నల్గొండలో గర్జించిన తీన్మార్ మల్లన్న
- సీఎం రేవంత్‌ను లైట్ తీసుకున్న వరంగల్ ఎమ్మెల్యేలు.. పొంగులేటికి రెడ్ కార్పెట్
- మాజీ సర్పంచ్‌లు అరెస్ట్.. రేవంత్‌కు హరీష్ రావు వార్నింగ్
- ముఖ్యమంత్రి పదవిపై మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు
- బీసీ రిజర్వేషన్ల పెంపునకు డెడికేటేడ్ కమిషన్
- టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్