క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పార్లమెంట్‌లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపిస్తున్నారు. ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న ఆదాయపు పన్ను చెల్లింపు దారుల కోసం బడ్జెట్‌లో శుభవార్త అందించారు మంత్రి నిర్మలా సీతారామన్. పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త అందించారు. రూ.12 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ లేదని మంత్రి నిర్మల్మ ప్రకటించారు. ఇదిలా ఉండగా, వచ్చేవారం కొత్త ఆదాయపు పన్ను చట్టం చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ ఆదాపు పన్ను ప్రకటన మధ్యతరగతి వారికి ఊరట కలిగేలా ట్యాక్స్ విధానమనే చెప్పాలి. భారతీయ న్యాయ సంహిత చట్టం తరహాలో ఐటీ చట్టం తీసుకురానున్నారు. TDS, TCS రేట్ల తగ్గింపు ఉంటుంది. అలాగే అద్దె ఆదాయంపై TDS రూ.6 లక్షలకు పెంపు ఉండగా, వడ్డీ ఆదాయంపై రూ. 2లక్షలకు పెంపు ఉంటుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- రేవంత్ పై 10 ఎమ్మెల్యేల తిరుగుబాటు?ఫాంహౌజ్‌లో సీక్రెట్ మీటింగ్
- అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. వాహనదారులకు మంత్రి పొన్నం వార్నింగ్
- టిడిపి కార్యాలయం పై దాడులు చేయడం మా తప్పే: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
- కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
- ‘‘నీళ్లు – నిజాలు’’పై రౌండ్ టేబుల్ సమావేశం.. ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు