రేవంత్ పై 10 ఎమ్మెల్యేల తిరుగుబాటు?ఫాంహౌజ్‌లో సీక్రెట్ మీటింగ్

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఓ ఫాంహౌజ్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టారు. ఈ అసమ్మతి ఎమ్మెల్యేల సమావేశానికి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రే ప్లాన్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేనే ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం కలకలం రేపుతోంది. అంతేకాదు తిరుగుబాటు ఎమ్మెల్యేల సమావేశానికి కారణమైన ఎమ్మెల్యే.. సీఎం రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకించిన సీనియర్ మంత్రి ప్రధాన అనుచరుడు కావడం మరింత కాక రేపుతోంది. సీనియర్ మంత్రి డైరెక్షన్ లోనే 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారనే చర్చ సాగుతోంది.

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ పెట్టారు. పనులు కాకపోవడం పై ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గానే ఈ సమావేశం అయ్యారని సమాచారం. అయితే అనిరుధ్ రెడ్డి ఫాంహౌజ్ లో 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారన్న విషయం తెలిసి సీఎం రేవంత్ టీమ్ అవాక్కైందని తెలుస్తోంది. మీటింగుకి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేల మీద నిఘా వర్గాలు ఆరా తీశాయని చెబుతున్నారు.

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాన అనుచరుడు. కోమటిరెడ్డి పంతం పట్టి మరీ అనిరుధ్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో అనిరుధ్ రెడ్డి నిర్వహించన సమావేశం వెనుక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హస్తం ఉందనే టాక్ వస్తోంది. మంత్రి కోమటిరెడ్డికి తెలియకుండా, ఆయనకు సమాచారం ఇవ్వకుండా అనిరుధ్ రెడ్డి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించని పాలమూరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొంత కాలంగా అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ టార్గెట్ గానే ఆయన తీరు ఉందనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.

Exit mobile version